'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై మురళీమోహన్ స్పందన

  • వర్మ సినిమాను స్వాగతిస్తున్నా
  • ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలి
  • బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతంగా ఉంటుంది
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై టీడీపీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. ఈ సినిమాను వర్మ తెరకెక్కించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే, ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలని, మన మధ్య లేని వారిని అప్రతిష్టపాలు చేయడం సరికాదని అన్నారు. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతంగా ఉంటుందని... ఆ సినిమాలో నటించే అవకాశం తనకు దక్కలేదని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Go Back to Shorts
lakshmis ntr
rgv
varma
murali mohan
Balakrishna
ntr
biopic
tollywood
Telugudesam

More Telugu News